Main Menu

Sravana Randhramula Neesathkathal Pogadanga (శ్రవణ రంధ్రముల నీసత్కథల్ పొగడంగ)

Composer: Seshappa Kavi, He could have approximately during 1800 AD. He belonged to Dharmapuri, a holy place on the banks of Godavari River in the Telangana region. He was a poet who dedicated his life to Sri Narasimha Swamy.More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
సీ. శ్రవణ రంధ్రముల నీ – సత్కథల్ పొగడంగ
లేశ మానందంబు – లేనివాడు
పుణ్యవంతులు నిన్ను – బూజసేయగ జూచి
భావమందుత్సాహ – పడనివాడు
భక్తవర్యులు నీ ప్ర – భావముల్ పొగడంగ
దత్పరత్వములేక – తలగువాడు
తనచిత్తమందు నీ – ధ్యాన మెన్నడు లేక
కాలమంతయు వృధా – గడపువాడు

తే. వసుధలోనెల్ల వ్యర్ధుండు – వాడె యగును
మఱియు జెడుగాక యెప్పుడు – మమతనొంది.
భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
దుష్టసంహార | నరసింహ – దురితదూర |

తాత్పర్యం:
ఓ శ్రీహరీ!నరసింహా!నీ ఉత్తమ కథలు వర్ణింప చెవులారావిని ఆనందించనివాడునూ,పుణ్యాత్ములు నిన్ను పూజింపగా మనస్సునందుత్సాహపడనివాడునూ భక్తాగ్రేసరులు నీ ప్రభావము లను ప్రస్తుతించ,భక్తితత్పరతను బొందనివాడునూ,మనస్సునీ యందుంచక కాలయాపన చేయువాడును పనికిమాలిన దుర్మార్గుడగును,అట్టి వాడెల్లపుడూ మోహాందకారములో పడి నశించిపోతాడు.
.


Poem:
See. Sravana Ramdhramula Nee – Satkathal Pogadamga
Lesa Maanamdambu – Lenivaadu
Punyavamtulu Ninnu – Boojaseyaga Joochi
Bhaavamamdutsaaha – Padanivaadu
Bhaktavaryulu Nee Pra – Bhaavamul Pogadamga
Datparatvamuleka – Talaguvaadu
Tanachittamamdu Nee – Dhyaana Mennadu Leka
Kaalamamtayu Vrudhaa – Gadapuvaadu

Te. Vasudhalonella Vyardhumdu – Vaade Yagunu
Marxiyu Jedugaaka Yeppudu – Mamatanomdi.
Bhooshanavikaasa | Sreedharma – Puranivaasa |
Dushtasamhaara | Narasimha – Duritadoora |

.


see. SravaNa raMdhramula nee – satkathal pogaDaMga
lESa maanaMdaMbu – lEnivaaDu
puNyavaMtulu ninnu – boojasEyaga joochi
bhaavamaMdutsaaha – paDanivaaDu
bhaktavaryulu nee pra – bhaavamul pogaDaMga
datparatvamulEka – talaguvaaDu
tanachittamaMdu nee – dhyaana mennaDu lEka
kaalamaMtayu vRudhaa – gaDapuvaaDu

tE. vasudhalOnella vyardhuMDu – vaaDe yagunu
marxiyu jeDugaaka yeppuDu – mamatanoMdi.
bhooShaNavikaasa | Sreedharma – puranivaasa |
duShTasaMhaara | narasiMha – duritadoora |

.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.