పద్యం:
సీ. గార్దభంబున కేల – కస్తూరి తిలకంబు?
మర్కటంబున కేల – మలయజంబు?
శార్ధూలమునక కేల – శర్కరాపూపంబు?
సూకరంబున కేల – చూతఫలము?
మార్జాలమున కేల – మల్లెపువ్వులబంతి?
గుడ్లగూబల కేల – కుండలములు?
మహిషాని కేల ని – ర్మలమైన వస్త్రముల్?
బకసంతతికి నేల – పంజరంబు?
తే. ద్రోహచింతన జేసెడి – దుర్జనులకు
మధురమైనట్టి నీనామ – మంత్రమేల?
భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
దుష్టసంహార | నరసింహ – దురితదూర |
తాత్పర్యం:
ఓ నారసింహా! గాడిదకు కస్తూరిబొట్టు, కోతికి గందము, బెబ్బులికి చక్కెరతో చేసిన పిండివంట, పందికి మామిడిపండు, పిల్లికి మల్లెమాలలు, గుడ్లగూబకు చెవులపోగులు, దున్నపోతునకు పరిశుభ్రమైన వస్త్రాలు, కొంగలకు పంజరము ఎట్లు సరిపడవో అటులనే దుర్మార్గ ప్రవృత్తులకు మధురమైన నీ దివ్యనామామృతము రుచించదు.
.
Poem:
See. Gaardabhambuna Kela – Kastoori Tilakambu?
Markatambuna Kela – Malayajambu?
Saardhoolamunaka Kela – Sarkaraapoopambu?
Sookarambuna Kela – Chootaphalamu?
Maarjaalamuna Kela – Mallepuvvulabamti?
Gudlagoobala Kela – Kumdalamulu?
Mahishaani Kela Ni – Rmalamaina Vastramul?
Bakasamtatiki Nela – Pamjarambu?
Te. Drohachimtana Jesedi – Durjanulaku
Madhuramainatti Neenaama – Mamtramela?
Bhooshanavikaasa | Sreedharma – Puranivaasa |
Dushtasamhaara | Narasimha – Duritadoora |
.
see. gaardabhaMbuna kEla – kastoori tilakaMbu?
markaTaMbuna kEla – malayajaMbu?
Saardhoolamunaka kEla – SarkaraapoopaMbu?
sookaraMbuna kEla – chootaphalamu?
maarjaalamuna kEla – mallepuvvulabaMti?
guDlagoobala kEla – kuMDalamulu?
mahiShaani kEla ni – rmalamaina vastramul?
bakasaMtatiki nEla – paMjaraMbu?
tE. drOhachiMtana jEseDi – durjanulaku
madhuramainaTTi neenaama – maMtramEla?
bhooShaNavikaasa | Sreedharma – puranivaasa |
duShTasaMhaara | narasiMha – duritadoora |
.
No comments yet.