Main Menu

Kothiki Jalathaarukullayi yetiki (కోతికి జలతారుకుళ్లాయి యేటికి)

Composer: Seshappa Kavi, He could have approximately during 1800 AD. He belonged to Dharmapuri, a holy place on the banks of Godavari River in the Telangana region. He was a poet who dedicated his life to Sri Narasimha Swamy.More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
సీ. కోతికి జలతారు – కుళ్లాయి యేటికి?
విరజాజి పూదండ – విధవ కేల?
ముక్కిడితొత్తుకు – ముత్తెంపు నత్తేల?
నద్ద మేమిటికి జా – త్యంధునకును?
మాచకమ్మకు నేల – మౌక్తికహారముల్?
క్రూరచిత్తునకు స – ద్గోష్ఠు లేల?
ఱంకుబోతుకు నేల – బింకంపు నిష్ఠలు?
వావి యేటికి దుష్ట – వర్తనునకు?

తే. మాట నిలుకడ కుంకరి – మోటు కేల?
చెవిటివానికి సత్కథ – శ్రవణ మేల?
భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
దుష్టసంహార | నరసింహ – దురితదూర |

తాత్పర్యం:
ఓ నరసింహా!కోతులకెందుకు జరీటోపీ!విధవాస్త్రీలకు మల్లె,సన్నజాజుల పూలమాలలెందుకు?ముక్కులేని ముండకు ముక్కుపోగులెందుకు?పుట్టు గ్రుడ్డివానికి అద్దమెందులకు? కాపురానికి పనికిరాని ఆడదానికి ముత్యాల హారాలెందుకు? దుష్టబుద్దులకు సద్గోష్టులెందుకు? వేశ్యలకెందుకు డాంభిక నియమాలు?దుష్ప్రవర్తనులకు వావి వరుసలెందుకు? లంచగొండికెందుకు మాటనిలకడలు, చెవిటివాని కెందుకు సత్కథా శ్రవణములు,ఇవన్నియు అవసరము లేదు.వ్యర్థములనియర్థము.
.


Poem:
See. Kotiki Jalataaru – Kullaayi Yetiki?
Virajaaji Poodamda – Vidhava Kela?
Mukkiditottuku – Muttempu Nattela?
Nadda Memitiki Jaa – Tyamdhunakunu?
Maachakammaku Nela – Mauktikahaaramul?
Kroorachittunaku Sa – Dgoshthu Lela?
Rxamkubotuku Nela – Bimkampu Nishthalu?
Vaavi Yetiki Dushta – Vartanunaku?

Te. Maata Nilukada Kumkari – Motu Kela?
Chevitivaaniki Satkatha – Sravana Mela?
Bhooshanavikaasa | Sreedharma – Puranivaasa |
Dushtasamhaara | Narasimha – Duritadoora |

.


see. kOtiki jalataaru – kuLlaayi yETiki?
virajaaji poodaMDa – vidhava kEla?
mukkiDitottuku – mutteMpu nattEla?
nadda mEmiTiki jaa – tyaMdhunakunu?
maachakammaku nEla – mauktikahaaramul?
kroorachittunaku sa – dgOShThu lEla?
rxaMkubOtuku nEla – biMkaMpu niShThalu?
vaavi yETiki duShTa – vartanunaku?

tE. maaTa nilukaDa kuMkari – mOTu kEla?
cheviTivaaniki satkatha – SravaNa mEla?
bhooShaNavikaasa | Sreedharma – puranivaasa |
duShTasaMhaara | narasiMha – duritadoora |

.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.