Main Menu

Thallidhandrulu Bharyathanayu laapulu Bava (తల్లిదండ్రులు భార్య తనయు లాప్తులు బావ)

Composer: Seshappa Kavi, He could have approximately during 1800 AD. He belonged to Dharmapuri, a holy place on the banks of Godavari River in the Telangana region. He was a poet who dedicated his life to Sri Narasimha Swamy.More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
సీ. తల్లిదండ్రులు భార్య – తనయు లాప్తులు బావ
మఱదు లన్నలు మేన – మామగారు
ఘనముగా బంధువుల్ – గల్గినప్పటికైన
దాను దర్లగ వెంట – దగిలి రారు
యముని దూతలు ప్రాణ – మపగరించుక పోగ
మమతతో బోరాడి – మాన్పలేరు
బలగ మందఱు దుఃఖ – పడుట మాత్రమె కాని
యించుక యాయుష్య – మియ్యలేరు

తే. చుట్టములమీది భ్రమదీసి – చూర జెక్కి
సంతతము మిమ్ము నమ్ముట – సార్థకంబు.
భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
దుష్టసంహార | నరసింహ – దురితదూర |

తాత్పర్యం:
ఓ నరసింహా! తల్లిదండ్రులు, భార్య, కొడుకులు, స్నేహితులు, బావమరదలు, అన్నలు, మేనమామలు, ఇలా ఎంతమంది దగ్గరబందువులున్నను తను పోయెడివేళ (చనిపోవునపుడు) వెంటరారు. యమదూతలు ప్రాణము తీయునపుడు నా వాడనుకొని వారిని వారించలేరు.యమదూతలు ప్రాణము తీయునపుడు నా వాడనుకొని వారిని వారించలేరు. బంధువులందరు భాధపడుదురేగాని బ్రాణమీయగ లేరు.కావున ఓ పంకజనాభా!బంధుప్రీతిమాని నిన్ను నా మనస్సున బంధించుటే ఉత్తమోత్తమమైన మార్గము.
.


Poem:
See. Tallidamdrulu Bhaarya – Tanayu Laaptulu Baava
Marxadu Lannalu Mena – Maamagaaru
Ghanamugaa Bamdhuvul – Galginappatikaina
Daanu Darlaga Vemta – Dagili Raaru
Yamuni Dootalu Praana – Mapagarimchuka Poga
Mamatato Boraadi – Maanpaleru
Balaga Mamdarxu Duhkha – Paduta Maatrame Kaani
Yimchuka Yaayushya – Miyyaleru

Te. Chuttamulameedi Bhramadeesi – Choora Jekki
Samtatamu Mimmu Nammuta – Saarthakambu.
Bhooshanavikaasa | Sreedharma – Puranivaasa |
Dushtasamhaara | Narasimha – Duritadoora |

.


see. tallidaMDrulu bhaarya – tanayu laaptulu baava
marxadu lannalu mEna – maamagaaru
ghanamugaa baMdhuvul – galginappaTikaina
daanu darlaga veMTa – dagili raaru
yamuni dootalu praaNa – mapagariMchuka pOga
mamatatO bOraaDi – maanpalEru
balaga maMdarxu duHkha – paDuTa maatrame kaani
yiMchuka yaayuShya – miyyalEru

tE. chuTTamulameedi bhramadeesi – choora jekki
saMtatamu mimmu nammuTa – saarthakaMbu.
bhooShaNavikaasa | Sreedharma – puranivaasa |
duShTasaMhaara | narasiMha – duritadoora |

.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.