Main Menu

Narasimha Naaku Dhurnayamulea Mondaaye (నరసింహ నాకు దు ర్ణయములే మెండాయె)

Composer: Seshappa Kavi, He could have approximately during 1800 AD. He belonged to Dharmapuri, a holy place on the banks of Godavari River in the Telangana region. He was a poet who dedicated his life to Sri Narasimha Swamy.More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
సీ. నరసింహ | నాకు దు – ర్ణయములే మెండాయె
సుగుణ మొక్కటిలేదు – చూడ జనిన
నన్యకాంతల మీద – నాశ మానగలేను
నొరుల క్షేమము చూచి – యోర్వలేను
ఇటువంటి దుర్బుద్ధు – లిన్ని నా కున్నవి
నేను జేసెడివన్ని – నీచకృతులు
నావంటి పాపిష్ఠి – నరుని భూలోకాన
బుట్టజేసితి వేల – భోగిశయన |

తే. అబ్జదళనేత్ర | నాతండ్రి – వైన ఫలము
నేరములు గాచి రక్షింపు – నీవె దిక్కు.
భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
దుష్టసంహార | నరసింహ – దురితదూర |

తాత్పర్యం:
ఓ పద్మరేకులవంటి కన్నులుగలవాడా!నరసింహా!చూడగా నాలో దుర్గుణములే యెక్కువగానున్నవికాని సద్గుణ మొక్కటియైన కానరాదు. పరస్త్రీ వ్యామోహము వదలలేను.యితరుల ఔన్నత్యమును చూచి సహించలేను.యిటువంటి చెడుబుద్దులున్నవి నాలో. నేను చేసే పనిలన్నియు తుచ్చములే. ఇలాంటి నన్ను ఈ భూమిపై ఎందుకు పుట్టించితివయ్యా! ఓ శేషశయనా!నీవే నా తండ్రివి.నీవే నా దిక్కు.నీ పుత్రుని తప్పులుసైచి కావుము తండ్రీ!
.


Poem:
See. Narasimha | Naaku Du – Rnayamule Memdaaye
Suguna Mokkatiledu – Chooda Janina
Nanyakaamtala Meeda – Naasa Maanagalenu
Norula Kshemamu Choochi – Yorvalenu
Ituvamti Durbuddhu – Linni Naa Kunnavi
Nenu Jesedivanni – Neechakrutulu
Naavamti Paapishthi – Naruni Bhoolokaana
Buttajesiti Vela – Bhogisayana |

Te. Abjadalanetra | Naatamdri – Vaina Phalamu
Neramulu Gaachi Rakshimpu – Neeve Dikku.
Bhooshanavikaasa | Sreedharma – Puranivaasa |
Dushtasamhaara | Narasimha – Duritadoora |

.


see. narasiMha | naaku du – rNayamulE meMDaaye
suguNa mokkaTilEdu – chooDa janina
nanyakaaMtala meeda – naaSa maanagalEnu
norula kShEmamu choochi – yOrvalEnu
iTuvaMTi durbuddhu – linni naa kunnavi
nEnu jEseDivanni – neechakRutulu
naavaMTi paapiShThi – naruni bhoolOkaana
buTTajEsiti vEla – bhOgiSayana |

tE. abjadaLanEtra | naataMDri – vaina phalamu
nEramulu gaachi rakShiMpu – neeve dikku.
bhooShaNavikaasa | Sreedharma – puranivaasa |
duShTasaMhaara | narasiMha – duritadoora |

.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.