Main Menu

Dharanilopala Neanuthalligarbhamunandhu (ధరణిలోపల నేనుతల్లిగర్భమునందు)

Composer: Seshappa Kavi, He could have approximately during 1800 AD. He belonged to Dharmapuri, a holy place on the banks of Godavari River in the Telangana region. He was a poet who dedicated his life to Sri Narasimha Swamy.More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
సీ. ధరణిలోపల నేను – తల్లిగర్భమునందు
బుట్టినప్పటినుండి – పుణ్యమెఱుగ
నేకాదశీవ్రతం – బెన్న డుండుగ లేదు
తీర్థయాత్రలకైన – దిరుగలేదు
పారమార్థికమైన – పనులు చేయగలేదు
భిక్ష మొక్కనికైన – బెట్టలేదు
ఙ్ఞానవంతులకైన – బూని మ్రొక్కగలేదు
ఇతర దానములైన – నియ్యలేదు

తే. నళినదళనేత్ర | నిన్ను నే – నమ్మినాను
జేరి రక్షింపవే నన్ను – శీఘ్రముగను.
భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
దుష్టసంహార | నరసింహ – దురితదూర |

తాత్పర్యం:
ఓ దుష్టసంహార!నరశింహా!దురితదూర!ఈ ధరణిపై తల్లిగర్భము నుండి పుట్టినది మొదలు పుణ్యము యొకింతయు నెఱుగను.ఏకాదశీవ్రత మెన్నడును చేయలేదు.పోనీ తీర్థయాత్రలనైనా తిరిగితినా! అదీలేదు. పుణ్యకార్యములసలే చేయలేదు. ఒక్కనికైనా భిక్షవేసిన పాపానపోలేదు.జ్ఞానులకు మ్రొక్కులేదు మరేయితర దానములీయలేదు.నిన్నే నమ్మితిని నళినదళేక్షా!త్వరగా నన్ను కావుము తండ్రీ!
.


Poem:
See. Dharanilopala Nenu – Talligarbhamunamdu
Buttinappatinumdi – Punyamerxuga
Nekaadaseevratam – Benna Dumduga Ledu
Teerthayaatralakaina – Dirugaledu
Paaramaarthikamaina – Panulu Cheyagaledu
Bhiksha Mokkanikaina – Bettaledu
Gnyaanavamtulakaina – Booni Mrokkagaledu
Itara Daanamulaina – Niyyaledu

Te. Nalinadalanetra | Ninnu Ne – Namminaanu
Jeri Rakshimpave Nannu – Seeghramuganu.
Bhooshanavikaasa | Sreedharma – Puranivaasa |
Dushtasamhaara | Narasimha – Duritadoora |

.


see. dharaNilOpala nEnu – talligarbhamunaMdu
buTTinappaTinuMDi – puNyamerxuga
nEkaadaSeevrataM – benna DuMDuga lEdu
teerthayaatralakaina – dirugalEdu
paaramaarthikamaina – panulu chEyagalEdu
bhikSha mokkanikaina – beTTalEdu
gnyaanavaMtulakaina – booni mrokkagalEdu
itara daanamulaina – niyyalEdu

tE. naLinadaLanEtra | ninnu nE – namminaanu
jEri rakShiMpavE nannu – Seeghramuganu.
bhooShaNavikaasa | Sreedharma – puranivaasa |
duShTasaMhaara | narasiMha – duritadoora |

.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.