Main Menu

Hari Neeku Baryankamaina Seshudu Chaala (హరి నీకు బర్యంక మైన శేషుడు చాల)

Composer: Seshappa Kavi, He could have approximately during 1800 AD. He belonged to Dharmapuri, a holy place on the banks of Godavari River in the Telangana region. He was a poet who dedicated his life to Sri Narasimha Swamy.More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
సీ. హరి | నీకు బర్యంక – మైన శేషుడు చాల
బవనము భక్షించి – బ్రతుకుచుండు
ననువుగా నీకు వా – హనమైన ఖగరాజు
గొప్పపామును నోట – గొఱుకుచుండు
అదిగాక నీ భార్య – యైన లక్ష్మీదేవి
దినము పేరంటంబు – దిరుగుచుండు
నిన్ను భక్తులు పిల్చి – నిత్యపూజలు చేసి
ప్రేమ బక్వాన్నముల్ – పెట్టుచుండ్రు

తే. స్వస్థముగ నీకు గ్రాసము – జరుగుచుండు
గాసు నీ చేతి దొకటైన – గాదు వ్యయము.
భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
దుష్టసంహార | నరసింహ – దురితదూర |

తాత్పర్యం:
ఓ శ్రీహరీ!నరశింహా!నీకు పాన్పుగానున్న శేషుడు గాలిని భక్షించి బ్రతుకుతుంటాడు.ఆగొప్ప పామును తిని నీ వాహనమైన గరుత్మంతుడు జీవిస్తుంటాడు.అంతేగాక నీ భార్యయైన లక్ష్మీదేవి కూడ ప్రతిదినము పేరంటములకు పోయి తన గ్రాసమునకు తను చూసుకొంటుంది.భక్తులు నిన్ను పూజించి ప్రేమతో పంచభక్ష్యాన్నాదు లొసంగుతారు,ఇంత స్పష్టముగ ఏ దిగులు లేకుండా నీకు మృష్టాన్నము లభించుచుండగా నీ చేతిచిల్లిగవ్వ కూడా ఖర్చుగాదు గదా!ఆహా ఏమి భాగ్యము!
.


Poem:
See. Hari | Neeku Baryamka – Maina Seshudu Chaala
Bavanamu Bhakshimchi – Bratukuchumdu
Nanuvugaa Neeku Vaa – Hanamaina Khagaraaju
Goppapaamunu Nota – Gorxukuchumdu
Adigaaka Nee Bhaarya – Yaina Lakshmeedevi
Dinamu Peramtambu – Diruguchumdu
Ninnu Bhaktulu Pilchi – Nityapoojalu Chesi
Prema Bakvaannamul – Pettuchumdru

Te. Svasthamuga Neeku Graasamu – Jaruguchumdu
Gaasu Nee Cheti Dokataina – Gaadu Vyayamu.
Bhooshanavikaasa | Sreedharma – Puranivaasa |
Dushtasamhaara | Narasimha – Duritadoora |

.


see. hari | neeku baryaMka – maina SEShuDu chaala
bavanamu bhakShiMchi – bratukuchuMDu
nanuvugaa neeku vaa – hanamaina khagaraaju
goppapaamunu nOTa – gorxukuchuMDu
adigaaka nee bhaarya – yaina lakShmeedEvi
dinamu pEraMTaMbu – diruguchuMDu
ninnu bhaktulu pilchi – nityapoojalu chEsi
prEma bakvaannamul – peTTuchuMDru

tE. svasthamuga neeku graasamu – jaruguchuMDu
gaasu nee chEti dokaTaina – gaadu vyayamu.
bhooShaNavikaasa | Sreedharma – puranivaasa |
duShTasaMhaara | narasiMha – duritadoora |

.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.