Main Menu

Pacchicharmapu Dhithipasaleedhu Dhehambu (పచ్చిచర్మపు దిత్తిపసలేదు దేహంబు)

Composer: Seshappa Kavi, He could have approximately during 1800 AD. He belonged to Dharmapuri, a holy place on the banks of Godavari River in the Telangana region. He was a poet who dedicated his life to Sri Narasimha Swamy.More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
సీ. పచ్చి చర్మపు దిత్తి – పసలేదు దేహంబు
లోపల నంతట – రోయ రోత
నరములు శల్యముల్ – నవరంధ్రములు రక్త
మాంసంబు కండలు – మైల తిత్తి
బలువైన యెండ వా – నల కోర్వ దింతైన
దాళలే దాకలి – దాహములకు
సకల రోగములకు – సంస్థానమె యుండు
నిలువ దస్థిరమైన – నీటిబుగ్గ

తే. బొందిలో నుండు ప్రాణముల్ – పోయినంత
గాటికే గాని కొఱగాదు – గవ్వకైన.
భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
దుష్టసంహార | నరసింహ – దురితదూర |

తాత్పర్యం:
ఓ నరశింహస్వామీ!ఈ శరీరము పచ్చితోలు సంచివంటిది.సారములేని దేహమిది.అంతరంగము అసహ్యమైనది.నరము,ఎముకలు,నవరంద్రముల తోలుతిత్తి యిది. (కనులు, చెవులు, ముక్కు, నోరు, గుహ్యము, గుదము) రక్తమాంసములు, కండలతోనున్న ముఱికి సంచి ఎండవానలకు తట్టుకోలేదు. ఆకలిదప్పులకు తాళలేదు. సకలరోగాల నిలయమీ శరీరము.ఇది స్థిరము కాని నీటి బుగ్గవంటిది.ప్రాణము పోయినంత శ్మశానమునకేగాని మరింకెందుకు కొఱరాని దేహమిది,కావున దేవా! బ్రతికియున్నంత కాలము నీపై భక్తి కలుగునట్లు దీవించుము తండ్రీ!
.


Poem:
See. Pachchi Charmapu Ditti – Pasaledu Dehambu
Lopala Namtata – Roya Rota
Naramulu Salyamul – Navaramdhramulu Rakta
Maamsambu Kamdalu – Maila Titti
Baluvaina Yemda Vaa – Nala Korva Dimtaina
Daalale Daakali – Daahamulaku
Sakala Rogamulaku – Samsthaaname Yumdu
Niluva Dasthiramaina – Neetibugga

Te. Bomdilo Numdu Praanamul – Poyinamta
Gaatike Gaani Korxagaadu – Gavvakaina.
Bhooshanavikaasa | Sreedharma – Puranivaasa |
Dushtasamhaara | Narasimha – Duritadoora |

.


see. pachchi charmapu ditti – pasalEdu dEhaMbu
lOpala naMtaTa – rOya rOta
naramulu Salyamul – navaraMdhramulu rakta
maaMsaMbu kaMDalu – maila titti
baluvaina yeMDa vaa – nala kOrva diMtaina
daaLalE daakali – daahamulaku
sakala rOgamulaku – saMsthaaname yuMDu
niluva dasthiramaina – neeTibugga

tE. boMdilO nuMDu praaNamul – pOyinaMta
gaaTikE gaani korxagaadu – gavvakaina.
bhooShaNavikaasa | Sreedharma – puranivaasa |
duShTasaMhaara | narasiMha – duritadoora |

.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.