Main Menu

Saadhu Sajjanulathoojagadamaadina Geedu (సాధు సజ్జనులతోజగడమాడిన గీడు)

Composer: Seshappa Kavi, He could have approximately during 1800 AD. He belonged to Dharmapuri, a holy place on the banks of Godavari River in the Telangana region. He was a poet who dedicated his life to Sri Narasimha Swamy.More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
సీ. సాధు సజ్జనులతో – జగడమాడిన గీడు
కవులతో వైరంబు – గాంచ గీడు
పరమ దీనుల జిక్క – బట్టి కొట్టిన గీడు
భిక్షగాండ్రను దుఃఖ – పెట్ట గీడు
నిరుపేదలను జూచి – నిందజేసిన గీడు
పుణ్యవంతుల దిట్ట – బొసగు గీడు
సద్భక్తులను దిర – స్కారమాడిన గీడు
గురుని ద్రవ్యము దోచు – కొనిన గీడు

తే. దుష్టకార్యము లొనరించు – దుర్జనులకు
ఘనతరంబైన నరకంబు – గట్టిముల్లె.
భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
దుష్టసంహార | నరసింహ – దురితదూర |

తాత్పర్యం:
ఓ నరశింహా!మంచివారితోనూ,శాంతస్వభావులలోనూ పోట్లాడుట,కవులతో పగపెంచుకొనుట,దీనులను హింసించుట, బిచ్చగాండ్రను దుఃఖపెట్టుట,నిరుపేదలను నిందించుట,పుణ్యాత్ములను పరిహసించుట లేక దూషించుట, మంచిభక్తులను తిరస్కరించుట,గురువు ద్రవ్యమునకాశపడుట,దొంగిలించుట మొదలైనచెడ్డ పనులలుచేయు పాపులకు ప్రాప్తించునది భయంకరమైన నరకమే సుమా!
.


Poem:
See. Saadhu Sajjanulato – Jagadamaadina Geedu
Kavulato Vairambu – Gaamcha Geedu
Parama Deenula Jikka – Batti Kottina Geedu
Bhikshagaamdranu Duhkha – Petta Geedu
Nirupedalanu Joochi – Nimdajesina Geedu
Punyavamtula Ditta – Bosagu Geedu
Sadbhaktulanu Dira – Skaaramaadina Geedu
Guruni Dravyamu Dochu – Konina Geedu

Te. Dushtakaaryamu Lonarimchu – Durjanulaku
Ghanatarambaina Narakambu – Gattimulle.
Bhooshanavikaasa | Sreedharma – Puranivaasa |
Dushtasamhaara | Narasimha – Duritadoora |

.


see. saadhu sajjanulatO – jagaDamaaDina geeDu
kavulatO vairaMbu – gaaMcha geeDu
parama deenula jikka – baTTi koTTina geeDu
bhikShagaaMDranu duHkha – peTTa geeDu
nirupEdalanu joochi – niMdajEsina geeDu
puNyavaMtula diTTa – bosagu geeDu
sadbhaktulanu dira – skaaramaaDina geeDu
guruni dravyamu dOchu – konina geeDu

tE. duShTakaaryamu lonariMchu – durjanulaku
ghanataraMbaina narakaMbu – gaTTimulle.
bhooShaNavikaasa | Sreedharma – puranivaasa |
duShTasaMhaara | narasiMha – duritadoora |

.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.