పద్యం:
సీ. నా తండ్రి నాదాత – నాయిష్టదైవమా
నన్ను మన్ననసేయు – నారసింహ |
దయయుంచు నామీద – దప్పులన్ని క్షమించు
నిగమగోచర | నాకు – నీవె దిక్కు
నే దురాత్ముడ నంచు – నీమనంబున గోప
గింపబోకుము స్వామి | – కేవలముగ
ముక్తిదాయక నీకు – మ్రొక్కినందుకు నన్ను
గరుణించి రక్షించు – కమలనాభ |
తే. దండిదొర వంచు నీవెంట – దగిలినాను
నేడు ప్రత్యక్షమై నన్ను – నిర్వహింపు.
భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
దుష్టసంహార | నరసింహ – దురితదూర |
తాత్పర్యం:
ఓ నరసింహా!నా తండ్రీ!దాత!నన్నేలు నా యిష్టదైవమా! నన్ను మన్నించుమో నారసింహా! నా తప్పులన్ని క్షమించి నా పై దయయుంచు తండ్రీ!నీవే నాకు దిక్కు నేను దుర్మార్గుడను, పాపాత్ముడనని యెంచకు స్వామీ! కోపగించకు తండ్రీ! ఓ కమలనాభ! నీకు మ్రొక్కినందుకు నన్ను కరుణించు ఓ కమలనేత్రా!నీవే గొప్ప దైవమని నమ్మి నీ వెంట నిలిచినాను. ప్రత్యక్షమై నన్ను కరుణింపుము.
.
Poem:
See. Naa Tamdri Naadaata – Naayishtadaivamaa
Nannu Mannanaseyu – Naarasimha |
Dayayumchu Naameeda – Dappulanni Kshamimchu
Nigamagochara | Naaku – Neeve Dikku
Ne Duraatmuda Namchu – Neemanambuna Gopa
Gimpabokumu Svaami | – Kevalamuga
Muktidaayaka Neeku – Mrokkinamduku Nannu
Garunimchi Rakshimchu – Kamalanaabha |
Te. Damdidora Vamchu Neevemta – Dagilinaanu
Nedu Pratyakshamai Nannu – Nirvahimpu.
Bhooshanavikaasa | Sreedharma – Puranivaasa |
Dushtasamhaara | Narasimha – Duritadoora |
.
see. naa taMDri naadaata – naayiShTadaivamaa
nannu mannanasEyu – naarasiMha |
dayayuMchu naameeda – dappulanni kShamiMchu
nigamagOchara | naaku – neeve dikku
nE duraatmuDa naMchu – neemanaMbuna gOpa
giMpabOkumu svaami | – kEvalamuga
muktidaayaka neeku – mrokkinaMduku nannu
garuNiMchi rakShiMchu – kamalanaabha |
tE. daMDidora vaMchu neeveMTa – dagilinaanu
nEDu pratyakShamai nannu – nirvahiMpu.
bhooShaNavikaasa | Sreedharma – puranivaasa |
duShTasaMhaara | narasiMha – duritadoora |
.
No comments yet.