పద్యం:
సీ. నరసింహ | నీవంటి – దొరను సంపాదించి
కుమతి మానవుల నే – గొల్వజాల
నెక్కు వైశ్వర్యంబు – లియ్యలేకున్నను
బొట్టకుమాత్రము – పోయరాదె?
ఘనముగా దిది నీకు – కరవున బోషింప
గష్ట మెంతటి స్వల్ప – కార్యమయ్య?
పెట్టజాలక యేల – భిక్షమెత్తించెదు
నన్ను బీదను జేసి – నా వదేమి?
తే. అమల | కమలాక్ష | నే నిట్లు – శ్రమపడంగ
గన్నులకు బండువై నీకు – గానబడునె?
భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
దుష్టసంహార | నరసింహ – దురితదూర |
తాత్పర్యం:
ఓ నరసింహా!నీ వంటి గొప్ప దేవునిగాంచి దుష్టులనెట్లు కొలవగలను తండ్రీ!అనగా కొల్వజాలనని భావము.ఘనమైన సంపదనీయకున్ననూ నా ఉదరపోషణ చేయరాదా తండ్రీ!కరుణతో నన్ను పోషించుట నీకేమంత గొప్పపని?నీకిది బహుస్వల్ప కార్యము నీవు పెట్టజాలక నన్ను బీదవానిగా నెందుకు జేసినావు?ఓ పరిశుద్దమైన కమలాక్ష!నేనిట్లు కష్టపడుట నీ కన్నులకు పండుగగాయున్నదా తండ్రీ!
.
Poem:
See. Narasimha | Neevamti – Doranu Sampaadimchi
Kumati Maanavula Ne – Golvajaala
Nekku Vaisvaryambu – Liyyalekunnanu
Bottakumaatramu – Poyaraade?
Ghanamugaa Didi Neeku – Karavuna Boshimpa
Gashta Memtati Svalpa – Kaaryamayya?
Pettajaalaka Yela – Bhikshamettimchedu
Nannu Beedanu Jesi – Naa Vademi?
Te. Amala | Kamalaaksha | Ne Nitlu – Sramapadamga
Gannulaku Bamduvai Neeku – Gaanabadune?
Bhooshanavikaasa | Sreedharma – Puranivaasa |
Dushtasamhaara | Narasimha – Duritadoora |
.
see. narasiMha | neevaMTi – doranu saMpaadiMchi
kumati maanavula nE – golvajaala
nekku vaiSvaryaMbu – liyyalEkunnanu
boTTakumaatramu – pOyaraade?
ghanamugaa didi neeku – karavuna bOShiMpa
gaShTa meMtaTi svalpa – kaaryamayya?
peTTajaalaka yEla – bhikShamettiMchedu
nannu beedanu jEsi – naa vadEmi?
tE. amala | kamalaakSha | nE niTlu – SramapaDaMga
gannulaku baMDuvai neeku – gaanabaDune?
bhooShaNavikaasa | Sreedharma – puranivaasa |
duShTasaMhaara | narasiMha – duritadoora |
.
No comments yet.