Composer: Dhurjati (or Dhoorjati) (Telugu: ధూర్జటి) (15th and 16th centuries, CE) was a Telugu poet. He was born to Singamma and Narayana in Sri Kalahasti and was the grandson of Jakkayya. He was a great devotee of lord Shiva, also known as Kalahasteeshwara. He referred to his birthplace as part of Pottapi Nadu, named after an earlier Chola kingdom based from Pottapi in Cuddapah in his works. More...
పద్యం:
మును నేపుట్టిన పుట్టులెన్నిగలవో / మోహంబుచే నందు చే
సిన కర్మంబుల ప్రోవు లెన్నిగలవో / చింతించినంగాని, యీ
జననంబేయని యున్నవాడ నిదిటే / చాలింపవే నిన్ను గొ
ల్చిన పుణ్యంబునకుం గృపారతుడవై / శ్రీ కాళహస్తీశ్వరా!
తాత్పర్యం:
శ్రీ కాళహస్తీశ్వరా!నేనిప్పటికి ఎన్ని జన్మలెత్తినానో,వాటిలో అజ్ఞానముచే ఎన్ని దుష్టకృత్యములు చేసితినో నాకు తెలియదు.ఇదియే నాకు చివరి జన్మ అని భావిస్తున్నాను.ఈ జన్మలో నిన్ను సేవించిన పుణ్యముతో పూర్వపు జన్మలలో చేసిన పాపములన్నియునూ తొలగిపోవునట్లు నన్ను అనుగ్రహించుము.
.
Meaning:
O Lord! I am ignorant of my various births and my wrong doings in them. I consider this as my last one. Bless me with removing all wrong doings of my previous births with the virtue accumulated in this one by serving you.
.
No comments yet.