పద్యం:
పెద్దలు విచ్చేసినచో
బధ్దకమునైన దుష్ట పద్దతి నైనన్
హద్దెరిగి లేవకున్నన్
మొద్దువలె జూతురని ముద్దుకుమారా.
తాత్పర్యం:
ఓ కుమారా.మన యింటికి పెద్దలు వచ్చినచో మర్యాదగాలేచి నిలబడవలెను.బద్దకమువలనగాని,పొగరుతోగాని,పెద్ద చిన్న భేధములు గ్రహించక మొండిగా లేవకున్నచో నిన్నందరూ మూర్ఖునిగా పరిగణిస్తారు.
.
Poem:
Peddalu vichchesinacho
Baddakamunaina dushta paddati nainan
Hadderigi levakunnan
Mudduvale juturani muddukumara.
.
peddalu vicchEsinacO
baddakamunaina duShTa paddati nainan
hadderigi lEvakunnan
mudduvale jUturani muddukumArA.
.
No comments yet.