పద్యం:
సీ. వెఱ్ఱివానికి నేల – వేదాక్షరంబులు?
మోటువానికి మంచి – పాట లేల?
పసులకాపరి కేల – పరతత్త్వబోధలు?
విటకాని కేటికో – విష్ణుకథలు?
వదరు శుంఠల కేల – వ్రాత పుస్తకములు?
తిరుగు ద్రిమ్మరి కేల – దేవపూజ?
ద్రవ్యలోభికి నేల – ధాతృత్వ గుణములు?
దొంగబంటుకు మంచి – సంగ తేల?
తే. క్రూరజనులకు నీమీద – గోరి కేల?
ద్రోహి పాపాత్మునకు దయా – దుఃఖ మేల?
భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
దుష్టసంహార | నరసింహ – దురితదూర |
తాత్పర్యం:
ఓ స్వామీ!నరశింహా!వెర్రివానికి వేదాక్షరములు,మోటువానికి మంచిపాటలు,పశువులకాపరికి పరతత్త్వభోదనలు, వ్యభిచారికి విష్ణుకథలు, వదరుబోతుకు వ్రాతపుస్తకాలు,తిరుగుబోతుకు దైవపూజ, పిసినారికి దాతృత్వ గుణము, దొంగలకు మంచి సంగతులు, దుర్మార్గులకు కోరికలు, ద్రోహులకు పాపత్ములకు దయాదుఃఖములు ఎందుకు తండ్రీ ! (అనగా వ్యర్థనియర్థము).
.
Poem:
See. Verxrxivaaniki Nela – Vedaaksharambulu?
Motuvaaniki Mamchi – Paata Lela?
Pasulakaapari Kela – Paratattvabodhalu?
Vitakaani Ketiko – Vishnukathalu?
Vadaru Sumthala Kela – Vraata Pustakamulu?
Tirugu Drimmari Kela – Devapooja?
Dravyalobhiki Nela – Dhaatrutva Gunamulu?
Domgabamtuku Mamchi – Samga Tela?
Te. Kroorajanulaku Neemeeda – Gori Kela?
Drohi Paapaatmunaku Dayaa – Duhkha Mela?
Bhooshanavikaasa | Sreedharma – Puranivaasa |
Dushtasamhaara | Narasimha – Duritadoora |
.
see. verxrxivaaniki nEla – vEdaakSharaMbulu?
mOTuvaaniki maMchi – paaTa lEla?
pasulakaapari kEla – paratattvabOdhalu?
viTakaani kETikO – viShNukathalu?
vadaru SuMThala kEla – vraata pustakamulu?
tirugu drimmari kEla – dEvapooja?
dravyalObhiki nEla – dhaatRutva guNamulu?
doMgabaMTuku maMchi – saMga tEla?
tE. kroorajanulaku neemeeda – gOri kEla?
drOhi paapaatmunaku dayaa – duHkha mEla?
bhooShaNavikaasa | Sreedharma – puranivaasa |
duShTasaMhaara | narasiMha – duritadoora |
.
No comments yet.